
ఎంపికైన విద్యార్థినులు
ప్రజాశక్తి - పొందూరు : శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మండలంలోని లోలుగు కెజిబివి విద్యార్థులు పలు క్రీడల్లో ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ రేజేటి సౌమ్య, వ్యాయామ ఉపాధ్యాయులు మొకర రూపవతి తెలిపారు. అండర్-14 విభాగంలో షాట్‌ఫుట్‌లో కె.జానకి ప్రథమ స్థానం, జి.అంజలి తృతీయ స్థానంలో నిలిచారు. అండర్-16 విభాగంలో షాట్‌పుట్‌లో ఎం.ద్రాక్ష ప్రథమ స్థానం, కె.రాజేశ్వరి తృతీయ స్థానం, జావెలిన్ త్రోలో వై.రమ తృతీయ స్థానంలో నిలిచారు. అండర్-18 విభాగంలో షాట్‌పుట్‌లో ఆర్.అనూష ప్రథమ స్థానంలో నిలిచారని చెప్పారు. ఏలూరులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.