ప్రజాశక్తి-అనంతపురం రాష్ట్రంలో గతంలో అమలైన దాదాపు 27 ఎస్సీ చట్టాలు ఎమయ్యాయని జనసేన పార్టీ జిల్లా అధక్షులు టిసి.వరుణ్ ప్రశ్నించారు. శనివారం నగరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పాలన అద్భుతంగా సాగుతోందని చెబుతున్న స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సంక్షేమ పాలన ఎక్కడ అమలవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు రాష్ట్రంలో సంక్షేమమే లేదన్నారు. ముఖ్యంగా రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లోని కులాలకు చెందిన కార్పొరేషన్ల ద్వారా ఎంతమంది లబ్ధిదారులకు మేలు చేకర్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రైతుకైనా సబ్సిడీ ద్వారా స్ప్రింక్లర్లు, డ్రిప్‌లు మంజూరు చేశారా.. అని నిలదీశారు. ఒక్క ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన 27 సంక్షేమ పథకాలను ఎత్తివేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఇంతవరకు ఒకరికైనా రుణం మంజూరు చేశారా.. అన్నారు. సిఎం జగన్ చేస్తున్న అక్రమాలతో ప్రజలు విసుగెత్తి పోయారన్నారు. అయితే ఒక సిద్ధాంతంతో మందుకెళ్తున్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను విమర్శించే హక్కు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఎక్కడుందన్నారు. మరోసారి పవన్‌కళ్యాణ్‌ని విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
విలేకరులతో మాట్లాడుతున్న జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టిసి.వరుణ్










