క్రీడాకారులు
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :రాష్ట్ర స్థాయి పోటీలకు మండలంలోని కోడూరు పంచాయతీ చెన్నపల్లిపాలెం హైస్కూల్ విద్యార్థులు ఎన్నికయ్యారు. ఇటీవల ఎసి సుబ్బారెడ్డి స్టేడియం (నెల్లూరు)లో జరిగిన స్కూల్ గేమ్స్ సెలక్షన్స్ నందు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల చెన్నపల్లి పాలెం విద్యార్థులు ముగ్గురు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. అండర్-17 వాలీబాల్ కు కె. రాజేష్, అండర్-14 వాలీబాల్ కి బి. ఉపేంద్ర, క్రికెట్ అండర్-17 పోటీలకు ఎం. సాయి అనే విద్యార్థులు ఎన్నికయ్యారు. ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రావినూతల సాయి ప్రసాద్, వ్యాయామ విద్య ఉపాధ్యా యులు వింజమూరు నాగరాజు, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు ఫణికుమార్ ఉన్నారు.










