Mar 11,2022 21:45

గాందీ విగ్రహం వద్ద యుటీఎఫ్‌ నేతలు



యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి జి వి రమణ
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్‌
16వ మహాసభకు ఒంగోలులో 1997లో జరిగిన 7వ రాష్ట్ర మహా సభల జండాను తీసుకొని, అదే విధముగా నెల్లూరు జిల్లా 5వ జాతాను కలిసి ఉదయం 6 గంటలకు శ్రీకాళహస్తి నుండి బయల్దేరిన ఉపాద్యాయులు అత్యధికంగా జాతాకు ఎదురొచ్చి స్వాగతం పలికారు. ఏర్పేడు మండలం తిరుపతి, చంద్రగిరి, పూతలపట్టు మండలాల మీదుగాచిత్తూరు నగరానికి చేరుకొన్నది. ఈసందర్భముగా ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి జి వి రమణ మాట్లాడుతూ మహాసభల్లో ఉపాధ్యాయుల సమస్యలు, విద్యారంగ సమస్యలపై చర్చిస్తామన్నారు. అశితోష్‌మిశ్రా రిపోర్టు ఆధారంగా పిఆర్‌సి స్లాబులు ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో 3,4,5 తరగతులను ఎత్తివేసి ఉన్నతపాఠశాలలకు తరలించడం వలన అనేక మంది పేదలు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు సుధాకర్‌ రెడ్డి, రెడ్డప్ప నాయుడు, జిల్లా సిపిఎస్‌ కన్వీనర్‌ ఎస్పి భాష, నెల్లూరు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డీజే రాజశేఖర్‌ , సి వి శేషులు, ప్రకాశం జిల్లా కార్యవర్గ సభ్యులు కిలారి వెంకటేశ్వర్లు, పి రాజసులోచన, సిపిఎస్‌ కన్వీనర్‌ అబ్దుల్‌ హై, ఎం ఎన్‌ శేఖర్‌, సురేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.