Nov 01,2023 23:13

శ్రీకాకుళం అర్భన్‌ : ఇంటింటా ప్రచారం చేస్తున్న లక్ష్మీదేవి

* మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌:
 రాష్ట్ర భవిష్యత్‌కు భరోసా చంద్రబాబు అని, అభివృద్ధి, సంక్షేమమే టిడిపి ధ్యేయమని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. నగరంలోని 48వ డివిజన్‌లో బాబు ష్యూరిటీ - భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి గడచిన కాలంలో చందబ్రాబు పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలను తుచ తప్పకుండా అమలు చేస్తామని అన్నారు. ఆడబిడ్డ నిధి ద్వారా ప్రతి ఇంట్లో 19 నుంచి 59 ఏళ్ల వయసు గల మహిళలకు రూ.1500 సాయంగా అందజేస్తామన్నారు. ప్రజాదరణ చూసి ఓర్వలేక ఓటమి భయంతో వైసిపి ప్రభుత్వం చంద్రబాబును అక్రమ పద్దతుల్లో జైల్‌లో ఉంచారని అన్నారు. ఆధారాలు లేని అక్రమ కేసు పెట్టి అరెస్టు చేసి 52 రోజుల పాటు నిర్భందించడం కక్షపూరిత చర్య అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఆయనకు బాసటగా నిలిచారన్నారు. రోడ్డుపైకి వచ్చి పోరాటం చేశారన్నారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా రాష్ట్ర భవిష్యత్‌కు టిడిపితో కలసి పనిచేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో బిసిసెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు శిల్లా శ్రీనివాసరావు, డివిజన్‌ ఇన్‌ఛార్జి సురకాసి వెంకటరావు, నియోజకవర్గం బిసి సెల్‌ కార్యదర్శి మడ్డి అప్పలరాజు, నగర తెలుగు యువత ఉపాధ్యక్షులు శిల్లా సురేంద్ర, నగర పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్‌, ప్రధాన కార్యదర్శి చిట్టి నాగభూషణం, జామి భీమశంకరరావు, కరగాన భాస్కరరావు, ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు పాల్గొన్నారు.
కోటబొమ్మాళి: టిడిపి అధికారంలోకి వస్తే ఏయే సంక్షేమ పథకాలు అందజేస్తామనేది ఇంటింటికి వెళ్ళి వివరించాలని మాజీ ఎంపిపిలు తర్ర రామకృష్ణ, వెలమల విజయలక్ష్మి, ఎంపిపి ప్రతినిధి కామమేశ్వరరావు అన్నారు. బుధవారం టిడిపి కార్యాలయంలో మండల టిడిపి నాయకులు, క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ ఇన్‌ఛార్జులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిడిపి రాష్ట్ర అద్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు వారి పరిధిలో ఉన్న ఇళ్లకు వెళ్లి టిడిపి అందించబోతున్న సంక్షేమ పథకాలు వివరించాలన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు నంబాళ్ల శ్రీనివాస్‌, గొండు లక్ష్మణరావు, సాసుమంతు ఆనందరావు, దేవాది సింహాద్రమ్మ, కోరాడ గోవిందరావు, లాడి శ్రీనివాస్‌, వెంకటేష్‌, వాన లక్ష్మి, బెండి అన్నపూర్ణ పాల్గొన్నారు.
టెక్కలి: రాష్ట్రంలో ఉన్న వైసిపి అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన ఆవసరం ఉందని టెక్కలి మండల టిడిపి ఆధ్యక్షులు బగాది శేషగిరి ఆన్నారు. మండలంలోని నర్సింగపల్లి పంచాయితీ పరిధి కొల్లివలస గ్రామంలో భవిష్యత్తుకి గ్యారంటీ కార్యక్రమం బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా టిడిపి మ్యానిపేస్టోని ఇంటింటికీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి పోలాకి షణ్ముఖరావు, రాంపురం సర్పంచ్‌ పినకాన జోగారావు, టిడిపి నాయకులు దారపు రాము, దల్లి ప్రసాద్‌రెడ్డి, పెదరట్టి మణి, రెయ్యి ప్రీతీష్‌ చంద్‌, దారపు జోగారావు, కోళ్ల కామేష్‌, మల్లిపెద్ది మదు పాల్గొన్నారు.
బూర్జ: బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం పెద్దపేట పంచాయతీ పరిధిలో నీలాపురం గ్రామంలో బిసిసెల్‌ మండల అధ్యక్షుడు మామిడి దుర్గారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. వైసిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రం పేదరికంలో కూరుకుపోయిందన్నారు. ఇతర రాష్ట్రాలకు నిరుపేద కుటుంబాలు వలసల బాట పట్టాయని, ప్రతి ఒక్కరూ ఆలోచించి టిడిపి ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఒకటి అమలుచేస్తుందన్నారు. కార్యక్రమంలో దాసిరెడ్డి వెంకునాయుడు, మజ్జి అప్పలనాయుడు పాల్గొన్నారు.