రాష్ట్ర భవిష్యత్ కోసం టీడీపీని ఆదరించాలి
ప్రజాశక్తి-పలమనేరు: రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీనీ ఆదరించాలని ఆ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి గిరిబాబు తెలిపారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని 21వ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు 'ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి' కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యతిరేక పాలన రాజ్యమేలుతోందని.. నాడు ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను నేడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వంసం చేస్తున్నారన్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు టీడీపీ పట్టణ అధ్యక్షులు ఆర్బీసీ కుట్టీ, కౌన్సిలర్లు సుబ్రహ్మణ్యం గౌడ్, నాగరాజు, నాయకులు సుధాకర్, లోకేష్, శ్రీనివాసులు, అస్లాం, రామ్మూర్తి, హరి, నదీం తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఆర్‌పురం: మండలంలోని చిల్లమాకులపల్లి గ్రామంలో సోమవారం మండల పార్టీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు ఆధ్వర్యంలో 'ఇదేమి ఖర్మ.. మన రాష్ట్రానికి' కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పొన్న దామోదర్, రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి బాలాజీనాయుడు, నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులు గుండయ్య, క్లస్టర్ ఇన్‌ఛార్జిలు బాబు, నాయుడు, పార్లమెంటరీ ఎస్సీసెల్ అధికార ప్రతినిధి కే యం రవి, మండల ఉపాధ్యక్షులు కామసాని నిరంజన్ రెడ్డి, మండల బీసీ సెల్ అధ్యక్షులు హేమాద్రి యాదవ్, కుప్పయ్య, రామిరెడ్డి, భూపతి రెడ్డి నోమేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
రామకుప్పం: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం బీసీలపై కక్షపూ రితంగా వ్యవహరి స్తోందని మండల తెలుగుదేశం పార్టీ బీసీ ముఖ్య నేతలు పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఇదేమి ఖర్మ.. మన రాష్ట్రానికి' కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఆనంద్‌రెడ్డి, రాష్ట్ర నేత మునస్వామి, మాజీ అధ్యక్షుడు ఆంజనేయ రెడ్డి, ప్రధాన కార్యదర్శి, నరసింహులు, బీసీ నేతలు నాగభూషణం, వేలు, సుబ్రీ, రవి, బాలు, మంజు, విశ్వనాథ్, వెంకటాచలం, చంద్ర, గిరిదాస్, మురళీ, వెంకటరమణ, అమర్, హుస్సేన్ పాల్గొన్నారు.










