Nov 01,2023 21:15

ఫొటో : అమరజీవికి నివాళులర్పిస్తున్న దృశ్యం

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
ప్రజాశక్తి-మర్రిపాడు : మర్రిపాడు గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 67వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం తెలుగు తల్లి, శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ప్రధానోపాధ్యాయులు పద్మలత, గ్రంథాలయ బాండగారి నారాయణ రావు మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం అవతరించడానికి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చేసిన కృషిని, పోరాట పటిమను గుర్తు చేసుకున్నారు. ఆయన 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను సైతం అర్పించిన త్యాగశీలి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగనిరతిని కొనియాడారు.
ఆయన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం తపాలా బిళ్లను విడుదల చేయడమే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయానికి, నెల్లూరు జిల్లాకు ఆయన పేరు నామకరణం చేశారన్నారు. ప్రతి ఒక్కరూ శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగనిరతిని వధా చేయకుండా తెలుగు భాష అభివద్ధికి, సంస్కతి సాంప్రదాయాలకు పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.