పొట్టి శ్రీరాములుకు నివాళి అర్పిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-గుడ్లూరు : ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు గుడ్లూరులో బుధవారం జరిగాయి. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బస్టాండ్ సెంటర్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్థానిక టిడిపి నాయకులు పూలమాలవేసి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని కొనియాడారు. మండల పరిషత్ సిబ్బంది కార్యక్రమాన్ని నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో చెన్నారెడ్డి మహేష్ ఆధ్వర్యంలో టిడిపి కార్యకర్తలు పాల్గొని మిఠాయిలు పంచారు.










