Mar 12,2022 22:20

డాక్టర్‌ మాదవి


ప్రజాశక్తి-తిరుపతి సిటి
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో డాక్టరు కె.మాధవి 1993 నుంచి మొట్టమొదటి ఫిజియోథెరపిస్టుగా గుర్తింపు పొందారన్నారు. 1995లో ఫిజియోథెరపీ కళాశాల ప్రిన్సిపాల్‌గా, డాక్టరు ఎన్‌టిఆర్‌ హెల్త్‌ సైన్సెస్‌కు మొట్టమొదటి ఇన్‌స్పెక్టర్‌గా, 2011లో ఫిజియోథెరపీలో గౌరవ డాక్టరేట్‌ను 2014లో ఆంధ్రప్రదేశ్‌ పిజికల్‌ థెరపీ అసోసియేషన్‌ ప్రథమ అద్యక్షురాలిగా వ్యవహరించారని తెలిపారు. దక్షిణ బారతదేశంలోనే బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ మొదటి కమిటీ సభ్యులుగా, 2014లో ఇండియన్‌ అసోసియేషన్‌ ఆప్‌ పిజియోథెరపీ వారి ఫెలోసిప్‌ అవార్డు పొందారని పేర్కొన్నారు. 2017లో పిజియోథెరపీ రంగంలో రాష్ట్రంలో స్టేట్‌ బెస్ట్‌ టీచర్‌గా అవార్డు, 2018లో జిల్లా కలెక్టరు చేతుల మీదగా బెస్ట్‌ ఎంప్లాయిస్‌ అవార్డు, 2019లో ఇండియన్‌ అసోసియేషన్‌ ఆప్‌ పిజియోథెరపీ సౌత్‌జోన్‌ గ్రీవియన్స్‌ కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారని వెల్లడించారు. అనేక అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న డాక్టరు మాదవి నేడు నూతనంగా హెల్త్‌ సైన్సెస్‌ చైర్‌పర్సన్‌గా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పలువురు మాదవిని అభినందించారు.