Apr 12,2023 20:52

ఎంఎల్‌ఎ మంతెన రామరాజు
ప్రజాశక్తి - కాళ్ల
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టిడిపి తిరిగి అధికారం చేపట్టాలని ఎంఎల్‌ఎ మంతెన రామరాజు అన్నారు. దొడ్డనపూడి గ్రామంలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మంతెన రామరాజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అన్ని తరగతుల ప్రజలకూ న్యాయం జరుగుతుందన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు, గ్యాస్‌ ధరలు, ఇంటి, చెత్త పన్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రభుత్వంలో పెంచిన పన్నులు కట్టలేక పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం విద్య, వైద్యం, మౌలిక వసతులు విస్మరించి రాష్ట్ర అభివృద్ధిని అధోగతి పాల్జేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు గుండా బత్తుల వెంకట నాగేశ్వరరావు, మాజీ ఎంపిపి అరేటి వెంకట రత్నప్రసాద్‌, గ్రామ అధ్యక్షులు కొల్లి భోగేశ్వరరావు, మాజీ సర్పంచులు చికిలే శ్రీను పాల్గొన్నారు.