రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే వెంకటే గౌడ
రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని
మరింత అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే వెంకటే గౌడ
ప్రజాశక్తి- పలమనేరు: పలమనేరు రూరల్ మండలంలోని కుర్మాయి పంచాయతీలోని జల్లిపేట గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మీ గడప వద్దకే మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెంకటే గౌడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో పలమనేరు నియోజకవర్గాన్ని మరింత అభివద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందింస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అన్నివర్గాల్లో సంతోషాన్ని నింపుతున్నాయని అన్నారు. ఈకార్యక్రమంలో జెడ్‌పిటిసి మల్లికా రంగనాథన్, వైసిపి మండల కన్వీనర్ బాలాజీ నాయుడు, హాస్పిటల్ చైర్మన్ చెంగారెడ్డి, కూర్మాయి సర్పంచ్ చెంగమ్మ జగన్మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.










