Mar 23,2022 21:56

మీటర్‌కు ఉన్న వైరును కత్తరించిన దృశ్యం


లబోదిబోమంటున్న రైతులు
ప్రజాశక్తి -తొట్టంబేడు:
పొలాల్లో మోటారు పెట్టాలంటేనే రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కష్టపడి రైతు పంటలు పండిస్తుంటే ఆ పంటలు చేతికందేలోపు నష్టాలోస్తున్నా పంటలను పండిస్తున్నారు రైతులు. దొంగలు సంవత్సరానికో మోటారు, స్టార్టర్‌లను దోచుకెళ్తుంటే, అప్పులు తీసుకోచ్చి పంటలను పండిస్తున్న రైతు పరిస్థితి దారుణంగా తయారైంది. మంగళవారం రాత్రి 50 మోటార్‌లకు సంబంధించిన వైర్లు, కేబుళ్ళను దోంగలు ఎత్తుకెళ్ళారు. గతంలో కూడా ఇలా దోంగతనాలు జరుగుతుందడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని, మళ్ళీ దోంగలు మోటార్లు, స్టార్టర్లు దోంగలిస్తుండడంతో పాలుపోని స్థితిలో రైతులుంటాన్నారు. ఐకనైనా పోలీసులు వైర్ల దోంగల ఆట కట్టించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.