రాళ్లు తేలిన దారులు.. నోళ్లు తెరిచిన గుంతలు
మరమ్మతులకు నోచుకోని పాఠశాలదారి
గులకరాళ్ళ దారిలో విద్యార్థుల అవస్థలు
సూచిక బోర్డు కూడా లేని కస్తూరిబా పాఠశాల
ప్రజాశక్తి- గంగవరం
మండలంలోని కస్తూరిబా బాలికల పాఠశాల రహదారికి 300మీటర్లు దూరంలో ఓ గుట్టపైన నిర్మితమై ఉన్నది. అయితే పాఠశాలకు వెళ్లే దారి గులకరాళ్లు హెచ్చుతగ్గులతో నడవడానికి వీలు లేక ఉండడంతో బాలికలు పాఠశాల చేరుకోవడానికి నానాఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థినుల అవస్థలపై పలుమార్లు చెబుతున్నా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పాఠశాల వద్ద చేరుకోవడానికి వాహనాలు కూడా వెళ్లడానికి కూడా దారిలేని దుస్థితి నెలకొంది. ఈ పాఠశాలకు సూచికబోర్డు కూడా లేకపోవడంతో దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు, తల్లిదండ్రులు అడ్రస్ తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు తిరిగి వెళ్లిపోతుంటే మరికొందరు చుట్టు పక్కల వారి దారి అడిగి పాఠశాలను వెతుకుతూ వెళుతున్నారు. అడ్రసు తెలియని వెళ్లిన సమయంలో స్థానికులు లేకుంటే ముందుకు వెళ్లిపోయి పక్కన ఉన్న గ్రామాలలో అడ్రస్ తెలుసుకుని మళ్లీ తిరిగి వెన్కకి రావడం మామూలు అయిపోయిందని వాపోతున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సమస్యను గుర్తించి రహదారిలో ఏర్పాటు చేసి పాఠశాల వరకు దారిని మరమ్మతులు చేయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.










