Nov 06,2022 22:34

కార్యక్రమంలో మాట్లాడుతున్న రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌

రాజ్యాంగ నిర్మాత.. అందరివాడు
- రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌
ప్రజాశక్తి- శాంతిపురం:
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కొందరివారు కాదని.. అందరివారని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌ అన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ భరత్‌తో కలసి ఆదివారం ఉదయం శాంతిపురం మండలం గట్టూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగంలోని హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. ప్రతిఒక్కరూ చదువుకోవాలని.. అందరికీ సమానంగా భూమి ఉండాలని, 21 సంవత్సరాలైతే ఓటు హక్కు ఉండాలని, పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు కల్పించారన్నారు. కుల వ్యవస్థ రూపుమాలన్నదే ఆయన ఆశయమని తెలిపారు. నాడు-నేడు కార్యక్రమంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివద్ధి చేస్తున్నారన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ భరత్‌ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ చదువుకోవాలన్నదే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయమని.. ప్రతిఒక్కరూ ఉన్నత చదువులు చదువుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పద్మావతమ్మ, సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారి రబ్బానీ బాషా, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ, ఆర్డీవో శివయ్య, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి నాగేశ్వరరావు, కుప్పం మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌, రెస్కో ఛైర్మన్‌ సెంధిల్‌కుమార్‌, జడ్పీటీసీలు కోదండరెడ్డి, శ్రీనివాసులు, కుప్పం ఎంపీపీ అశ్వని, మాజీ జడ్పీ ఛైర్మన్‌ యం.సుబ్రహ్మణ్యంరెడ్డి, దళిత, గిరిజన సంఘాల నాయకులు కష్ణకుమారి, డాక్టర్‌ యామిల సుదర్శన్‌, శివ ప్రసాద్‌, దేవరాజులు, రాజ్‌ కుమార్‌, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.