Dec 06,2022 22:33

అంబేద్కర్‌ విగ్రహానికి నివాళ్ళు అర్పిస్తున్న జేసి వెంకటేశ్వర్లు

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌
జిల్లావ్యాప్తంగా ఘన నివాళి

అంబేద్కర్‌ విగ్రహానికి నివాళ్ళు అర్పిస్తున్న జేసి వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్‌, యంత్రాంగం: అంబేద్కర్‌ 66వ వర్థంతిని పురస్కరించుకొని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, దళిత సంఘాల నేతలు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ చేసిన కషి మరువలేనిదని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ అన్నారు. చిత్తూరు నగరంలోని దర్గా సర్కిల్‌ లో గల అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు చిత్తూరు అర్‌డిఓ రేణుక నివాళులు అర్పించిన వారిలో వున్నారు. ఈ సందర్భంగా మీడియా వారితో జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ అంబేద్కర్‌ కషిని రాజ్యాంగ నిర్మాణంలో మరువలేనిదని, ఆయన సేవల ప్రతి ఫలాలను అనుభవిస్తున్నా మన్నారు. ఆయన చేసిన ప్రతిపాదనల వల్ల రాజ్యాంగం లో అన్నివర్గాల వారికి సముచిత స్థానం దక్కిందన్నారు.
బైరెడ్డిపల్లి: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 66 వర్ధంతి సందర్భంగా బైరెడ్డిపల్లి నాలుగు రోడ్ల వద్ద అంబేడ్కర్‌ యూత్‌ యువసేన ఆధ్వర్యంలో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. స్వీట్లు పంచిపెట్టారు.
వి.కోట: భారతరత్న బాబాసాహెబ్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతిని మండల ప్రజలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ కూడలి వద్ద ఆయన కాంస్య విగ్రహానికి ఎంపీపీ యువరాజ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బాలు గురునాథ్‌ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు పూలమాలలు వేసి స్మరించుకున్నారు. సమసమాజ స్థాపనే ధ్యేయంగా నిరంతరం పోరాడిన మహనీయుడు అంబేడ్కర్‌ అన్నారు.
గుడిపల్లి: గుడిపల్లి మండల కేంద్రంలో మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించి చిత్రపటానికి నివాళులర్పించారు. నియోజకవర్గ ఎస్సీసెల్‌ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆరాధ్య దైవమని తెలిపారు. వెదురుకుప్పం: వెదురుకుప్పంలో డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ విగ్రహానికి మంగళవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సోమల: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 66వ వర్ధంతి వేడుకలు మంగళవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, అన్నెమ్మగారిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధ్యాపకులు ఘన నివాళి అర్పించారు.
బంగారుపాళ్యం: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ప్రపంచ దేశాలలోనే ఆదర్శనీయులని.. పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్‌ బాబు అన్నారు. మంగళవారం నాలుగు రోడ్ల కూడలి నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ఆయన చిత్రపటానిన జడ్పీటీసీ సోమశేఖర్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భవిత పాఠశాల పిల్లలకు ఎంపీటీసీ హేమచంద్ర ఆధ్వర్యంలో పలకలు, అట్టలు, పుస్తకాలు, స్వీట్లు, బిస్కెట్లు పంచిపెట్టారు. గంగవరం: అంబేడ్కర్‌ భవనంలో మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు నివాళులు అర్పించారు. అలాగే కల్లుపల్లి, గంగవరం కస్తూరిబా పాఠశాలలో పిల్లలకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు.
ఎస్‌ఆర్‌పురం: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రతిఒక్కరూ జీవించాలని నాయకులు కుప్పయ్య, రాజేంద్ర అన్నారు. మంగళవారం మండల అభివద్ధి కార్యాలయం వద్ద బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రొంపిచెర్ల: రొంపిచెర్ల ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వ్యంలో డాక్టర బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యావేత్త డాక్టర్‌ రఘునాథ్‌, ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు ధనంజయ, కుల సంఘాల నాయకులు బంగారు నారాయణస్వామి, ఓబులేషు, నూరేషా, వెంకటేష్‌, మీనాక్షి, రాజన్న, ముజీబ్‌, మహ్మదలీ, నూరుళ్ళా, మస్తాన్‌, బావాజాన్‌, వెంకట రమణ, గిరిబాబు, రాజేంద్ర నాయుని, ఖాజాపీర్‌, బావాజీ, సయ్యద్‌ బాషా, పి.వి.రమణ, కె.కష్ణయ్య పాల్గొన్నారు. యాదమరి: భారతరత్న బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఎంపీపీ సురేష్‌ బాబు, మాజీ జెడ్పీటీసీ మనోహర్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.