రాజకీయాలకతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు
డిప్యూటీ సీఎం నారాయణస్వామి
ప్రజాశక్తి- గంగాధరనెల్లూరు: వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చినట్లు డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం వేపంజేరి పంచాయతీ ముసలయ్య గారిపల్లి, వేపంజేరి దళితవాడ, సర్విరెడ్డిపల్లి, సర్విరెడ్డిపల్లి ఎస్టీకాలనీలో అధికారులు, వైసిపి నాయకులతో కలిసి డిప్యూటీ సీఎం ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయని విధంగా నవరత్నాల పథకంతో ప్రజలకు చేయూత అందిస్తున్నట్లు పేర్కొన్నారు. టిడిపి, జనసేన, కాంగ్రెస్ నాయకులందరూ సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి లేనిపోని విమర్శలు చేయడం వారి దివాలా కోరుతనానికి నిదర్శనం అన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం 175 ఎమ్మెల్యే సీట్లకు 175 క్లీన్ స్వీప్ చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీదేవి, తహశీల్దార్ ఇన్బనాదన్, ఐసిడిఎస్ సిడిపిఓ వినీతశ్రీ, ఏఈలు గాయత్రి, సుగుణాకర్ రావు, వేపంజేరి మాజీసర్పంచ్ వరదరాజులురెడ్డి, ఎంపీటీసీ రామచంద్రా రెడ్డి, వైసిపి నాయకులు సురేందర్‌రెడ్డి, పూర్ణచంద్రారెడ్డి, గుణశేఖర్‌రెడ్డి, వెంకటరెడ్డి, చిట్టిబాబు మొదలి, వెంకటేష్‌లు రెడ్డి, శంకర్ మొదలి, అయ్యప్ప, శ్రీ బాబు, కేశవులు, పాల్గొన్నారు.










