Oct 01,2023 20:46

మాట్లాడుతున్న జి.వి.ఎల్‌ నర్సింహారావు

* దసరా లోపు విశాఖ-వారణాసి రైలు
* ఎంపీ జి.వి.ఎల్‌ నర్సింహారావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
ఉత్తరాంధ్ర జిల్లాల వెనుకబాటుకు రాజకీయ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని బిజెపి రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్‌ నర్సింహారావు అన్నారు. నగరంలోని అరసవల్లిలో సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని ఆదివారం దర్శించుకున్న అనంతరం ఒక హోటల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న పార్టీలు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశాయన్నారు. దేశంలోనే అతి తక్కువ తాగునీటి సదుపాయం ఉన్న జిల్లాలుగా ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఉన్నాయన్నారు. దసరా లోపు విశాఖ-వారణాసి రైలును ప్రారంభించే అవకాశాలు ఉన్నాయన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత యాజమాన్యం, కార్మికులపైనే ఉందన్నారు. చంద్రబాబు అరెస్టుపై విలేకరులు ప్రశ్నించగా, న్యాయస్థానం పరిధిలో ఉన్న వాటిపై తాను మాట్లాడబోనన్నారు. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు పూడి తిరుపతిరావు, పైడి వేణుగోపాలం, జిల్లా అధ్యక్షులు బి.ఉమామహేశ్వరరావు, చల్లా వెంకటేశ్వరరావు, శవ్వాన ఉమామహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.