- ఎంపీపీ యువరాజ్
ప్రజాశక్తి-వి కోట : రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ విద్యను అందించడమే జగనన్న లక్ష్యంగా ముందుకెళ్తున్నారని ఎంపీపీ యువరాజ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం వి.కోట మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో జగనన్న విద్య కానుక కిట్లను విద్యార్థులకు పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ జగనన్న విద్యా కానుక సామాగ్రిలో నాణ్యమైన మూడు జతల యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, షూస్, సాక్స్, బెల్టు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీని విద్యార్థులు వినియోగించుకుని శ్రద్ధతో చదువుకుని గొప్ప పౌరులుగా ఎదగాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాన్ని నెరవేర్చేందుకు ప్రతి విద్యార్థి పాటు పడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ బాలగురునాద్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా విద్యా కానుకను అందజేయడం జరుగుతున్నదని నాడు నేడు కార్యక్రమాల్లో రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా మండలంలో వంద పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచడం జరిగిందన్నారు. వైసిపి రాష్ట్ర కార్యదర్శి పియన్ నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో అందుబాటులో ఉన్న ఇంగ్లీష్ మీడియం సౌకర్యాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అమ్మ ఒడి, ఆణిముత్యాలు ద్వారా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలందు పాఠశాలలో మొదటి 3 ర్యాంకుల వారికి 3,2,1 వేల రూపాయలు ప్రోత్సహకము అందించడం జరుగుతుందన్నారు. జగనన్న గోరుముద్ద తో రోజుకో రకంగా మెనూ విద్యార్థులకు అందుబాటులో ఉందన్నారు. వైస్ ఎంపీపీ డాక్టర్ తమీం ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో పేద విద్యార్థులకు మెరుగైన యూనిఫామ్ నోట్ బుక్స్ మరియు ఫర్నిచర్, టీవీలు వినియోగంలోనికి రావడం చాలా సంతోషదాయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎంఎస్ చంద్రశేఖర్, బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దామోదర్ నాయుడు, బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరుశురాం నాయుడు కాజీపేట పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ ఇలియాస్ తో పాటు పలువురు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.










