- సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం
ప్రజాశక్తి-భీమవరం : ప్రజా సమస్యలు పరిష్కారానికై సుందరయ్య పోరాట స్పూర్తితో ఉద్యమాలు నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దక్షిన భారత దేశంలో కమ్యూనిస్టుపార్టీ ఉద్యమ నిర్మాత, కమ్యూనిస్టు గాంధీ,పీడిత ప్రజల విముక్తిదాత పుచ్చలపల్లి సుందరయ్య 30వ వర్ధంతి సభ ఈరోజు శుక్రవారం భీమవరం మెంటేవారితోట పార్టీ ఆఫీసులో పార్టీ పట్టణ కార్యదర్శి బి.వాసుదేవరావు అధ్యక్షతన జరిగింది. ఈ సభకు ముక్యవక్తగా హాజరైన సిపిఎంజిల్లా కార్యదర్శి బి.బలరాం ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు,జోహార్లు అర్పించారు. ఈ సభకు భీమవరం కార్మిక వర్గం నుండి సుమారు 200మంది హాజరయ్యారు. ఈ సభను ఉద్దేసించి బి.బలరాం పుచ్చలపల్లి సుందరయ్యగారి జీవిత విశేషాలను కార్మిక వర్గంతో పంచుకున్నారు.సుందరయ్యగారు నెల్లూరు జిల్లా అలగానుపాడులో భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. ఆయన బాల్యంలోనే ప్రజలజీవితాల మద్య అంతరాలను గుర్తించారు. ఈ అంతరాలు పోవాలి అందరూ సమానంగా జీవించాలని ఆ దిశగానే ఆయన జీవితాన్ని మల్చుకుని పనిచేశారు. పుచ్చలపల్లి సుందరయ్య బాల్యంలోనే విద్యార్ధి దశలోనే స్వాతంత్య్రోద్యమం ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని పశ్చిమగోదావరి జిల్లాలో అరెస్టు అయ్యారన్నారు. కమ్యూనిస్టుపార్టీలో చేరి దక్షిణ భారత దేశంలో పార్టీ స్థాపించి దాని అబివృద్దికి అచంచలమైన కృషిచేశారన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్దరాజు రామంతో కలసి పార్టీని స్ధాపించారన్నారు. నిజాంపాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణా సాయుధ పోరాటంలో మల్లుస్వరాజ్యం, చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవపునయ్య, మోటూరి హనుమంతురావులతో కలసి ప్రధాన భూమికను పోషించారన్నారు. నిజాంలను తరిమికొట్టి వేలాది ఎకరాలను పేద ప్రజలకు దక్కేలా చేశారన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య సిపిఎం పార్టీ మొట్టమొదని ప్రధాన కార్యదర్శిగా పనిచేశారన్నారు. పార్లమెంటులో రాజ్యసభ సభ్యునిగా అడుగుపెట్టి వ్యవసాయ కార్మికుల, కార్మికుల సమస్యలపై గళమెత్తిన ప్రజానాయుకుడుని బలరాం అన్నారు. గన్నవరం నియోజకవర్గంనుండి ఎం.ఎల్.ఎగా పోటీచేసి ఎన్నికయ్యారన్నారు. పార్లమెంట్‌కుగాని, అసెంబ్లీకి గాని సైకిల్ మీద వెళ్లిన గొప్పనిరాడంబర జీవితం అయానదని బలరాం కొనియాడారు. ప్రజా ఉద్యమాలను పునికిపుచ్చుకొని సుందరయ్య ఉద్యమస్పూర్తితో పనిచేయాలని బలరాం కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సుందరయ్య వర్ధంతి రోజును పురష్కరించుకొన జిల్లా వ్యాప్తంగా అన్ని మండల పట్టణ కేంద్రాల్లో,కార్మిక వాడవాడల్లో చలివేంద్రాలు ప్రారంబించినట్లు బలరాం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎం.రామాంజనేయులు, ఎం.వైకుంఠరావు, పట్టణ కమిటీ సభ్యులు బొక్క సత్యనారాయణ, చెల్లబోయిన వెంకటేశ్వరారావు, బంగారు వరలక్ష్మి, కార్మికులు,కార్యకర్తలు పాల్గొన్నారు.










