- సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి మల్లికార్జున
ప్రజాశక్తి-రాయదుర్గం : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఐదు కోట్ల తెలుగు ప్రజల ఆత్మ గౌరవంగా భావించే విశాఖ ఉక్కు పరిశ్రమను అప్పనంగా తన ఆప్త మిత్రులైన ఆదాని అంబానీలకు కట్టబెట్టేందుకు చేస్తున ప్రయత్నాలను విరమించుకోవాలని, తక్షణమే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను చేసే విధానాన్ని ఉపసంహరించుకోవాలని బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు రాస్తారోకో కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది. రాయదుర్గం పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో బళ్లారి రోడ్డు బాలగంగాధర్ తిలక్ స్కూల్ వద్ద రాస్తారోకో చేయకుండా పోలీసులు అడ్డుకొని అక్రమంగా అరెస్టు చేసి సిపిఎం నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే విధానాన్ని ఉపసంహరించుకునేంత వరకు ఈ ఉద్యమాలను వదిలే ప్రసక్తే లేదని సిపిఎంగా కేంద్ర ప్రభుత్వం హెచ్చరించారు. అదేవిధంగా కేంద్రం విశాఖ ఉక్కు పరిశ్రమ పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరుపై నోరు మెదపని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి మల్లికార్జున, సిపిఎం సీనియర్ నాయకులు నాగరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బంగి శివ, పార్టీ పట్టణ కమిటీ సభ్యులు మధు, అంజి,నాగరాజు, శ్రీరాములు, తిమ్మరాజు, కృష్ణ నాయక్ ,నాగేంద్ర, ఎస్ఎఫ్ఐ నాయకులు వంశీకృష్ణ, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.










