May 03,2023 13:17

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం తాడేపల్లిగూడెం పట్టణంలో సిపిఎం సిపిఐ పార్టీలు సిఐటియు పట్టణ కమిటీల ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ ఐల్యాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, సిపిఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, సిఐటియు పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణలు హాజరయ్యారు.ఈ కార్యక్రమం ను ఉద్దేశించి సిపిఎం పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, సిఐటియు పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణలు మాట్లాడుతూ 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకానికి పెట్టి మోడీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని వారు అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, అదానీలకు కట్టబెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు.విశాఖ ఉక్కు - ఆంద్రుల హక్కు అని,  విశాఖ ఉక్కు పరిరక్షణకై నిరంతర పోరాటాలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం 800 రోజులుగా జయప్రదంగా సాగిందని వారు అన్నారు.బిజెపి మోడీ ప్రజలకు అచ్చేదిన్ తీసుకువస్తానని ప్రచారం చేసి చచ్చేదిన్ తీసుకొచ్చారని వారు అన్నారు.వందశాతం పెట్టుబడులు ఉపసంహరణ చేయాలనే బిజెపి ప్రభుత్వ విధానం ఓడిపోవడం ఖాయమని వారు అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను కేంద్రం ఉపసంహరించుకునే వరకూ పోరాటాలు ఆగవని తేల్చి చెప్పారు. పలు దఫాలుగా వివిధ రూపాల్లో నిరసనలు తెలిపినా కేంద్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ స్టీల్ పరిరక్షణ పోరాటాలు ఏదో ఒక రూపంలో కొనసాగుతుందన్నారు. దేశంలోనే సముద్రతీరంలో ఉండే ఏకైక స్టీల్ ప్లాంట్ విశాఖపట్టణం  స్టీల్ ప్లాంటని తెలిపారు. సొంతగనులు లేకపోయినా ఈ ఆర్ధిక సంవత్సరం తొమ్మిది నెలల్లో 700 కోట్ల నికరలాభాలను ఆర్జించిందని వారు అన్నారు. ఈ కార్యక్రమానికి చిటికిన రాము, పోతు శ్రీను,నరమాల కృష్ణ, మేట్రేటి రమణ, పులిమంతుల రమణ, కుంచంగి నానాజీ, గొర్రెల సతీష్ కుమార్, పతివాడ నాగేంద్రబాబు తదితరులు పాల్లోన్నరు.