Jul 24,2023 16:34

ప్రజాశక్తి-పుట్లూరు(అనంతపురం) : హింసపై మహిళల పోరు యాత్ర మహిళలపై హింసను అరికట్టాలి మద్యం మత్తు పదార్థాలను నియంత్రించాలని జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు రాష్ట్ర వ్యాప్త బస్సుయాత్ర ఈ యాత్రను జయప్రదం చేయాలని పుట్లూరు మండలంలోని ఓబులాపురం గ్రామంలో సోమవారం కర పత్రాలు విడుదల చేయడం జరిగినది. అనంతరం మహిళా సంఘం నాయకులు మాట్లాడుతూ దేశంలోనూ రాష్ట్రంలోనూ మహిళలపై హింస రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుంది మల్ల యోధులు ఢిల్లీలో చేసిన ఆందోళన ఒక చిన్న ప్రతిఘటన మాత్రమే మహిళలపై జరుగుతున్న హింస పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణితో ఉన్నాయి మహిళా రక్షణ చట్టాలన్నీ మహిళా ఉద్యమ ఫలితాలే హింసను ప్రతిఘటిస్తేనే మహిళలు భవిష్యత్తుకు భద్రత అందుకే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్రవ్యాప్తంగా పోరుయాత్ర చేపడుతుంది హిందూపురం నుండి శ్రీకాకుళం నుండి బస్సులు బయలుదేరిరెండు బస్సు యాత్రలు ఆగస్టు 8న అమరావతికి చేరుకొని అదే రోజు వేలాది మహిళలతో బహిరంగ సభ నిర్వహిస్తున్నాము ఈ సభకు ఐద్వా జాతీయ నాయకురాలు శ్రీమతి బృందాకారత గారు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహిళా సంఘం కార్యదర్శి టి రేణుక సిపిఎం మండల కార్యదర్శి ఎస్ సూరి సహాయ కార్యదర్శి జి వెంకట చౌదరి భాస్కర్ రెడ్డి టీ పెద్దయ్య నాగభూషణం లక్ష్మీదేవి అంజినమ్మ సరస్వతి కళ దేవి  ఎస్ పుల్లయ్యతదితరులు పాల్గొన్నారు.