Oct 04,2022 16:35

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి :  మండల కేంద్రంలో ఉన్న కోట్ల విలువ చేసే పది సెంట్ల స్థలాన్ని కబ్జాకు గురికాకుండా కాపాడాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. బైరెడ్డిపల్లె మండల కేంద్రం లోని చెక్ పోస్ట్ వద్ద సర్వే నెం :50/2 లో 52 సెంట్ల స్థలం ఉంది. అందులో  42 సెంట్ల స్థలంలో ఎస్సి హాస్టల్ నిర్మించారు. మిగిలిన 10 సెంట్ల స్థలం ఖాళీగా ఉంది. 2014లో ఈ స్థలాన్ని అక్రమించుకోవడానికి కొంతమంది ప్రయత్నించగా దళిత సంఘాల నాయకులు అడ్డుకున్నారు. అప్పట్లో ఈ స్థలాన్ని ఇతరుల ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని సాంఘిక సంక్షేమ శాఖ తహశీల్దార్ ను ఆదేశించింది. తాజాగా కొంతమంది ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి పునాదిరాళ్లు తోలడంతో దళిత సంఘాల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. తహశీల్దార్ కుమారస్వామి కి వినతిపత్రం అందజేశారు.
వెంటనే స్పందించిన తహసీల్దార్ పునాదిరాళ్లు తొలగించి ఎవరూ ఆ స్థలంలో ప్రవేశించకుండా ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు బిఓ సుబ్రమణ్యం, చలపతి, రమణ, హరి, బాబు, మహేష్, బాస్ నాయకులు కుమార్, అనిల్ కుమార్,ప్రవీణ్ తదితరులతో పాటూ పెద్ద ఎత్తున దళిత. నాయకులు పాల్గొన్నారు.