ప్రజాశక్తి వెదురుకుప్పం : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెదురుకుప్పంలో పిల్లల ప్రతిభను అభినందిస్తూ జిల్లాస్థాయి పోటీలలో జనరల్ పోస్టర్ విభాగంలో మొదటి బహుమతి పొందిన కె..గాయత్రి (9వ తరగతి)ఆజాద్ కా అమృత మహోత్సవ విభాగంలో తృతీయ బహుమతి పొందిన వి. రమ్య(9వ తరగతి)లను ప్రధానోపాధ్యాయులు పి వెంకట రమణారెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నిక కావడంతో వీరు డిసెంబర్ 9వ తేదీన విజయవాడలో జరిగే పోటీలలో పాల్గొనాల్సి ఉందని ఆయన తెలిపారు. వీరికి శిక్షణ ఉపాధ్యాయులుగా సైన్సు ఉపాధ్యాయులు భ్రమరాంబ,జ్యోత్స్న, శ్యామల, మస్తాన్, విజయలక్ష్మి లను ప్రధానోపాధ్యాయులు అభినందనలు తెలిపి సోమవారం సన్మానించారు.
విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీయడానికి భారతీయ విజ్ఞాన మండలి, ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కౌశల్ 2022 జిల్లా స్థాయి పోటీలు చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలకు ఉమ్మడి వేదిక శ్రీవిద్య డిగ్రీ కాలేజ్ పుత్తూరు నందు ఘనంగా జరిగాయి అని అందులో తమ పాఠశాల పిల్లలు ప్రతిభ చాటారని ఇలాగే పిల్లలు సైన్స్ పట్ల అభిరుచినీ పెంచుకుని అనేక విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక కాబడిన ప్రతి జిల్లా నుండి విచ్చేసిన 36 టీములు మొత్తం(72 టీంలు)మరియు పోస్టర్ ప్రజెంటేషన్ లో పాల్గొనే విద్యార్థులు రెండు జిల్లాల నుండి సుమారు 700 మంది ఈ పోటీలో పాల్గొంటే అందులో మన పిల్లలు ప్రతిభను చాటారని డాక్టర్ బండి ప్రభాకర్ రెడ్డి తెలిపారు.










