Apr 02,2023 16:10

ప్రజాశక్తి-వి.కోట : నేటి నుండి జరగనున్న పదో తరగతి పరీక్షలకు వి.కోట మండలంలోని పాఠశాలలు  సర్వం సిద్ధంగా ఉన్నాయని  మండల విద్యాశాఖ అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలో 1226 మంది విద్యార్థులు ఈ ఏడు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. మండలంలో వి కోట బాలుర ఉన్నత పాఠశాలలో ఏ, బి కేంద్రాలు, బాలికల ఉన్నత పాఠశాలలో ఒకటి, వి. కోటలోని ఇన్ ఫ్యాంట్ జీసస్ పాఠశాలతో పాటు గోనుమాకులపల్లి , కుంబార్లపల్లి ఉన్నత పాఠశాలల్లో మొత్తం 6 సెంటర్లలో పరీక్షలు నిర్వహించనునట్లు వారు  తెలిపారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. విద్యార్థుల పరీక్షల సమయంలో ఎటువంటి తొందరపాటు పడకుండా  పరీక్ష సమయానికి ముందే  పాఠశాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా సమయానికి విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల నుండి ఆర్టీసీ సేవలు కొనసాగుతాయని తెలిపారు.