ప్రజాశక్తి-ఆచంట ( పశ్చిమగోదావరి జిల్లా) : అంగన్ వాడి కేంద్రాల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న అధిక పోషణాలు కల్గిన ఆహరాన్ని అంగన్ వాడి చిన్నారులు కిషోర బాలికలు, బాలింతాలు విధిగా తీసుకొని రక్తహీనతకు గురి కాకుండా ఉండాలని ఆచంట మండల సర్పంచ్ ల ఛాంబర్ అధ్యక్షులు సుంకర సీతారామ్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలo కొడమంచిలి సచివాలయం వద్ద పోషణ పక్వాడ్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వపరంగా మహిళలకు అందించే పౌష్టి ఆహారాన్ని సద్విని చేసుకోవాలని ఆయన కోరారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అంగన్ వాడి కేంద్రాలను రూపురేకుల మార్చి చిన్నారుల భవిష్యత్ ను తీర్చాదిద్దడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్ లు పోలిశెట్టి దుర్గా భవాని గున్నాబత్తకామేశ్వరి, సల్లపూడి సుజాత, కోట రజిని, నక్కా ఫిబే కుమారి, కలగట లక్ష్మి, సల్లపూడి సుజాత డ్వాక్రా సిసి మాధవి, ఎం ఎల్ హెచ్ పి రాశి, ఎఎన్ ఎం వెంకటరమణ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గున్నారు.










