ప్రజాశక్తి-రొద్దం : సూపరింటండెంట్ ఆఫ్ పోలీస్, శ్రీ సత్య సాయి జిల్లా ఉత్తర్వుల మేరకు, రాజశ్రీ పెనుకొండ ఎస్.డి.పి.వో పర్యవేక్షణలో, రాజశ్రీ పెనుకొండ సిఐ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పోలీసులకు రాబడిన సమాచారం మేరకు నా సిబ్బంది సహాయంతో రొద్దం మండలం, గోనిమేకలపల్లి గ్రామ శివార్లలో గల కంప చెట్ల వద్ద పేకాట స్థావరంపై రైడ్ చేసి 13 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వద్ద నుండి రూ.55,300/-, 2 మోటార్ సైకిళ్ళను మరియు ఒక ఆటో ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు, ఎస్ ఐ నాగస్వామి తెలపారు.ఉగాది పండగ సమయములో ఎవరైనా పేకాట ఆడిన, ఆడించిన వారి పై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎవరైనా పై నేరాలకు పాల్పడిన వారిగురించి సమాచారం ఇవ్వాలని రొద్దం ఎస్ ఐ ఫోన్ నంబర్- 9440901902 కి ఫోన్ చేసిన తెలపాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.










