ప్రజాశక్తి - ఉండి
ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ప్రజలకు సంజీవని వంటిదని వైసిపి సోషల్ మీడియా జిల్లా కో-ఇన్‌ఛార్జి పాటూరి శ్రీనివాస దొరబాబు అన్నారు. మండలంలోని పెదపుల్లేరు గ్రామంలో బుధవారం నిర్వహించిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని దొరబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ప్రజలకు సంజీవని వంటిదన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గుండెకు సంబం ధించిన ఇసిజి, వివిధ రకాల రక్త పరీక్షలు నిర్వహించడమే కాకుండా షుగర్, బిపి వ్యాధిగ్రస్తులకు, గర్భిణులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.సాయిచంద్ర, హెల్త్ క్లినిక్ సిబ్బంది పాల్గొన్నారు.










