Jul 12,2023 21:25

ప్రజాశక్తి - పాలకొల్లు రూరల్‌
             లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య పరిధిలోని కాపవరం గ్రామంలో జరుగుతున్న ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మహేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్యాంపులో గర్భిణులకు, బాలింతలకు, బిపి, షుగర్‌ వ్యాధిగ్రస్తులకు, ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి అందుతున్న సేవలపై డాక్టర్‌ ప్రతాప్‌కుమార్‌ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మహేశ్వరరావు మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం ద్వారా అవసరమైనవారికి 105 రకాలు మందులు ఇస్తూ 14 రకాల పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. ఈ వైద్యసేవలను ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని డాక్టర్‌ మహేశ్వరరావు తెలిపారు. అనంతరం చింతపర్రు గ్రామంలో జరుగుతున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ అడ్డాల ప్రతాప్‌ కుమార్‌, ఆరోగ్య విస్తరణ అధికారి గుడాల హరిబాబు, ఆప్తాల్మిక్‌ అధికారి ఎంఆర్‌కె.రాజు, పిహెచ్‌ఎన్‌ పి.ఎలిజిబెత్‌, సూపర్‌వైజర్‌ ఎస్‌కె.అమలేశ్వరరావు, సీనియర్‌ అసిస్టెంట్‌ మహీధర్‌ రెడ్డి, హెల్త్‌ అసిస్టెంట్‌ తారక్‌, ఎంఎల్‌ హెచ్‌పిలు యువతేజ, శ్రావణి, ఎఎన్‌ఎంలు అనిత, సుజ్ఞానమణి, డిఇఒ సురేష్‌, సుందర్‌ సింగ్‌, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
కాళ్ల : వర్షాకాలం దృష్ట్యా ప్రతిఒక్కరూ స్వచ్ఛమైన నీటిని తాగాలని వైద్యాధికారి ఎస్‌.సునీల్‌ అన్నారు. మండలంలోని దొడ్డనపూడి గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి సునీల్‌ మాట్లాడుతూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని, పరిసరాల పరిశుభ్రతతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని ప్రజలకు సూచించారు. పిహెచ్‌సి, 104 వైద్య సిబ్బందితో ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం నిర్వహించారు. షుగర్‌, బిపి, జనరల్‌ వంద మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఒ విజయవతి, హెచ్‌వి.పరంజ్యోతి, ఎఎన్‌ఎంలు సరోజినీ, పిఎన్‌ శ్రీదుర్గ, ఎంఎల్‌హెచ్‌పి శిరీష, 104 సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.