ప్రజాశక్తి-తాడిపత్రి రూరల్ గ్రామాల్లో ఫ్యాక్షన్ లేకుండా చేయడమే ప్రజా సంక్షేమ యాత్ర లక్ష్యమని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని వెంకటరెడ్డిపల్లి గ్రామంలో మూడో విడత ప్రజా సంక్షేమ యాత్రను ప్రారంభించారు. వెంకటరెడ్డిపల్లి నుంచి గదరగుట్టపల్లి, తెల్లమిట్టపల్లి, భోగసముద్రం మీదుగా అయ్యవారిపల్లి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నాయకులు ప్రజలను అమాయకులను చేసి తప్పుడు సందేశాలతో మభ్యపెడుతూ ఫ్యాక్షన్ రెచ్చగొడుతూ ఇష్టానుసారంగా పాలన చేశారన్నారు. తాను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. తనపై 73 కేసులు పెట్టారని తప్పుడు ఆరోపణ చేస్తున్న జెసి ప్రభాకర్‌రెడ్డి కేసులు పెట్టినట్లు నిరూపిస్తే తాడిపత్రి వదిలి వెళ్తానన్నారు. నిరూపించకపోతే మీరు తాడిపత్రిని వదిలిపోతారా.. అని సవాల్ విసిరారు. మళ్లీ అధికారంలోకి రానున్నది వైసిపీనే అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రమణమ్మ, ఎంపిపి సరస్వతి, వెంకటరెడ్డిపల్లి వైసిపి నాయకులు పుల్లారెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, మునిరెడ్డి, ఆలూరు రామేశ్వర్‌రెడ్డి, హనుమంతురెడ్డి, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి










