Jun 01,2023 20:46

ప్రజాశక్తి - తణుకురూరల్‌
మండలంలోని తేతలి, పైడిపర్రు జాతీయ రహదారి ప్లైఓవర్‌ నిర్మాణానికి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి గురువారం స్థల పరిశీలన చేశారు. తేతలిలో 1.80 ఎకరాలు, పైడిపర్రులో 24 సెంట్ల భూమిని పరిశీలించారు. అనంతరం ఇందుకు సంబంధించిన మ్యాప్‌లు, రూట్‌ మ్యాప్‌లను పరిశీలించి అధికారులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జెసి వెంట ఇన్‌ఛార్జి తహశీల్దార్‌ కె.ఉదయ భాస్కర్‌, మండల సర్వేయర్‌, సిబ్బంది ఉన్నారు.