Apr 17,2023 20:59

ప్రజాశక్తి - భీమవరం
ఫిష్‌ ఆంధ్రా యూనిట్లు త్వరితగతిన గ్రౌండింగ్‌ అయ్యేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ ఛాంబర్లో కలెక్టర్‌ జిల్లాలో ఫిష్‌ ఆంధ్రా యూనిట్ల స్థాపనపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అన్ని కేటగిరిల్లోని యూనిట్ల స్థాపనకు లబ్ధిదారుల ఎంపికను త్వరితగతిన పూర్తిచేసే రుణాల మంజూరుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. రూ.50 లక్షల యూనిట్‌ స్థాపనకు భీమవరంలో గుర్తించిన స్థలాన్ని లీజ్‌కు ఇవ్వడానికి సూత్రపాయంగా కలెక్టర్‌ అంగీకారం తెలిపారు. సమావేశంలో జిల్లా మత్స్యశాఖాధికారి ఆర్‌విఎస్‌వి ప్రసాద్‌, డిఆర్‌డిఎ పీడీ ఎంఎస్‌ఎస్‌ వేణుగోపాల్‌, మెప్మా పీడీ ఇమ్మానుయేల్‌, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి దుర్గేష్‌ పాల్గొన్నారు.