ప్రజాశక్తి - పాలకోడేరు
మండలంలోని మోగల్లు, గొరగనమూడి గ్రామ పంచాయతీలకు నుంచి వచ్చిన రెండు ఫిర్యాదులపై పంచాయతీ విస్తరణాధికారి వి.రెడ్డియ్య మంగళవారం విచారణ చేశారు. మోగల్లు గ్రామంలోని సుబ్బరాజుచెరువు, ఊరచెరువుల్లో పంచాయతీ అధికారులు ఎటువంటి తీర్మానాలు లేకుండా చేప పిల్లలు వేశారని, అనంతరం తీర్మానాలు చేసిన వెంటనే బిల్లుల రూపంలో రూ.1.20 లక్షలు మంజూరు చేశారంటూ ఇరువురు వార్డు సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంచాయతీ విస్తరణ అధికారి రెడ్డియ్య విచారణ చేశారు. గొరగనమూడిలో వాలంటీరుగా పని చేస్తున్న ఓ వ్యక్తి విధులు సరిగ్గా నిర్వహించకుండా ఓ టీవీ ఛానల్ విలేకరులు తనకు తెలుసంటూ నిర్లక్ష్యంగా వ్యవహిస్తోందని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేశారు. నివేదికలను ఎంపిడిఒ ఎన్.మురళీ గంగాధరరావుకు అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు గొట్టుముక్కల వెంకట శివరామరాజు, కృష్ణకుమారి పాల్గొన్నారు.










