నాణ్యమైన విద్యుత్ సరఫరా ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ప్రజాశక్తి-వి కోట : రాష్ట్రంలోని ప్రజలందరికీ నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర భూగర్భ ఘనులు, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మండల కేంద్రమైన మండల పరిధిలోని తోటకనుమ పంచాయతీ పరిధిలో సుమారు 6 ఎకరాల స్థలములు రూ. 30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 132/33 కె.వి విద్యుత్ సబ్స్టేషన్ స్థాపనకు భూమి పూజ కార్యక్రమానికి బుధవారం ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లో వోల్టేజ్ సమస్యను అధిగమించే లక్ష్యంతో అవసరమైన ప్రాంతాల్లో నూతన సబ్స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. తోటకు నిమ్మ పంచాయతీలో ఏర్పాటు చేయనున్న సబ్ స్టేషన్ వల్ల ఈ ప్రాంత ప్రజలకు రైతులకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసేందుకు వీలుపడుతుందన్నారు. వీటితోపాటు అధికారులు ప్రజాప్రతినిధులు గుర్తించిన ఇతర ప్రాంతాల్లో కూడా త్వరలో నూతన సబ్ స్టేషన్లను ప్రారంభించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ, పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ బాలగురునాథ్, వికోట మండల వైస్ ఎంపీపీ, తమీంఖాన్, కిషోర్ గౌడ్ తో పాటు వివిధ శాఖల అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.










