Jul 12,2022 23:14

పవర్లూమ్‌ కార్మికులతో అధికారుల చర్చలు
శిబిరం తొలగించి పనిలోకి వెళ్ళండి మాట్లాడదాం
అధికారుల తీరుపై కార్మికుల ఆగ్రహం
ప్రజాశక్తి- నగరి:
సమ్మె శిబిరానికి మరమగ్గ కార్మికుల కుటుంబాల్లోని చిన్న, పెద్ద, వృద్ధ, మహిళలు సైతం సమ్మె శిబిరం వద్దకు చేరుకుని నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. కార్మికులు న్యాయమైన పోరాటానికి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు నుంచి సంఘీభావం రోజురోజుకీ పెరుగుతున్నప్పటికీ స్థానిక అధికారులు లేబర్‌ అధికారులు, జిల్లా ఉన్నతాధికారి దష్టికి తీసుకుపోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనిపై పోరాట ఉదతం చేయాలని సోమవారం జిల్లా కలెక్టర్‌ని సీపీఎం చిత్తూరు జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు ఆధ్వర్యంలో మరమగ్గ కార్మికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పెరుమాళ్‌తో సహా 100మంది కార్మికులతో కూలిరేట్ల పెంపుపై వినతిపత్రం అందించి తమ సమస్యలను వివరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్‌ ఆర్డీఓతో మాట్లాడుతూ లేబర్‌ అధికారులు కలిసి కార్మికుల న్యాయం చేయాలని ఆదేశించారు. దీంతో స్పందించిన అధికారులు మంగళవారం ఆర్డీఓ ఏసీఎల్‌ జోల పరిశ్రమ అధికారి, ఎంపీడీవో కార్యాలయంలో కార్మికనాయకులతో చర్చలు జరిపారు. ఇంకా మాస్టర్‌ వివర్లను గుర్తించలేకపోతున్నామని, చర్చలు జరడానికి ఇంకో వారం సమయం అవసరమని నిర్లక్ష్యం ధోరణితో సమాధానం ఇవ్వడంతో మరమగ్గ కార్మికుల సంఘం సభ్యులు రేపు ఉదయం నగరి తహశీల్దార్‌ కార్యాలయం ముందు తమ శిబిరాన్ని మారుస్తామంటూ అల్టిమేటం జారీ చేశారు. ఈచర్చలకు హాజరైన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య, అధ్యక్షుడు వాడ గంగరాజు, పుత్తూరు సిఐటియు నాయకులు వెంకటేష్‌ అధికారుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ సమస్య పరిష్కారం అయితేనే సమ్మె విరమింప చేస్తామని తేల్చి చెప్పారు. అనంతరం లేబర్‌ అధికారి కార్మికులు దీక్షాశిబిరాన్ని సందర్శించి కార్మికులతో మాట్లాడుతూ మీ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని అందరూ సహకరించాలని కోరారు. ఆలస్యం చేయకుండా సమస్య పరిష్కారం చేసే దిశగా వెంటనే చర్యలు చేపట్టాలని కార్మికులు అధికారికి తెలిపారు. ఉద్యమం ఉధతం కావడానికి అధికారుల నిర్లక్ష్యం వైఖరి కారణమని వెంటనే సమస్యను పరిష్కారం చేసి దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.