Jun 09,2022 22:47

నగరిలో జిల్లా కార్యదర్శి వాడా గంగరాజు

'ఇంటింటికి సిపిఎం' నేతల దృష్టికి సమస్యలు
ప్రజాశక్తి - నగరి

తమకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని, పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో వలే విద్యుత్‌ రాయితీలివ్వాలని పవర్‌లూం కార్మికులు వేడుకొన్నారు. 'ఇంటింటికి సిపిఎం' కార్యక్రమం నగరిలోని కొత్తపేటలో సిపిఎం నాయకులు పెరుమాళ్‌ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభమయ్యింది. సిపిఎం జిల్లా కార్యదర్శి వాడా గంగరాజు పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేలాదిమంది పవర్‌లూం కార్మికులు ఉన్నారని, కరెంట్‌ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని, పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో వలే రాయితీలు ఇవ్వాలని పవర్‌లూం కార్మికులు నేతల దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా సమస్యలపై 20న సచివాలయాల ఎదుట, 27న కార్పొరేషన్‌, మున్సిపల్‌ కార్యాలయాల ఎదుట, జులై 11న కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేయనున్నట్లు గంగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంతి, షణ్ముగం, రంజిత్‌, అయ్యప్ప, మురగేష్‌ పాల్గొన్నారు.