5వ రోజు అర్థనగ ప్రదర్శనతో నిరసన
ప్రజాశక్తి- నగరి
నగిరి పరిసరప్రాంతాల్లో ఉన్న వేలాది మంది పవర్లూమ్ కార్మికులకు కూలిరేట్లు పెంచాలని నగిరి రైల్వేగేట్ వద్ద భారీస్థాయిలో రిలే దీక్షలను ఈనెల 5వ తేదీ ప్రారంభించారు. ఈదీక్షలు 5వ రోజుకు చేరుకున్న సందర్భంగా కార్మికులు అర్థనగ ప్రదర్శనతో నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఇస్తున్న కూలి రేట్లు గత పది సంవత్సరాల ముందు నుండి ఇచ్చే రేట్లు మాత్రమేనని, ఇప్పుడు అన్ని రకాల నిత్యవసర వస్తువులపై భారీ స్థాయిలో రేట్లు పెరిగాయని, మరి వాటికి తగ్గట్టు కూలి రేట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోవడం లేదని వాపోయారు. మరమగ్గ కార్మికుల సమస్యల పరిష్కారానికి మాస్టర్ వివర్లు కూడా దిగి రావాలని, మరమగ్గ కార్మికుల న్యాయమైన పోరాటమని, వారి పోరాటాన్ని మాస్టర్ వివర్లు అర్థం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పవర్లూమ్ కార్మికులు పాల్గొన్నారు.










