మాట్లాడుతున్న వినుత
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):
శుక్రవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలను పక్కన బెట్టి, పాలసీ పరంగా చర్యకు సిద్దమా అని సవాల్‌లు విసిరారు. అసెంబ్లిలో ప్రజా సమస్యలు ఎన్నడూ మాట్లాడని ఎమ్మెల్యే, రాబోవు ఎలక్షన్స్‌లో ఎమ్మెల్యే టికెట్టు కూడా ఇవ్వరని, అందుకే తమ అధినేత మందు మెప్పు సాదించడానికి పవన్ కళ్యాణ్‌ను వాడుతున్నారన్నారు. శృతి మించితే ఎమ్మెల్యే చీకటి వ్యాపారాలను బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన అధికార ప్రతినిధి కోట చంద్రబాబు, ఉమామహేశ్వరి, భాగ్యలక్ష్మి, త్యాగరాజు, గోపి, మునికుమార్ రెడ్డి పాల్గొన్నారు.










