శాలువా కప్పి సన్మానిస్తున్న నాయకులు
పవన్ కళ్యాణ్‌ను కలిసిన జిల్లా జనసేన నేతలు
ప్రజాశక్తి-నెల్లూరు అర్బన్:జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను జనసేన జిల్లా నాయకులు అమరావతిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్‌రెడ్డి, నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజరుబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు , రాష్ట్ర నాయకులు సుందరరామిరెడ్డిలు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయాల గురించి కాసేపు ముచ్చటించారు. నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. గతంలో 470 కిలోల వెండితో పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని నాదెండ్ల మనోహర్ ఆవిష్కరణ చేసిన సంగతి తెలిసిందే .ఆ చిత్ర పటాన్ని తాను చూశానని ,బాగుందని పవన్ కళ్యాణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం వెండితో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రతిమను తయారు చేయించి దసరా నవరాత్రుల సందర్భంగా పవన్ కళ్యాణ్ కు బహూకరించారు . గతంలో తయారు చేసిన తన ఫొటో .. నేడు తయారు చేసిన అమ్మవారి ప్రతిమలు చాలా బాగున్నాయి సుజరు అంటూ ప్రశంసించారు. అదే విధంగా జనసేన పార్టీ తరపున ఒక్క నెల్లూరు నగరంలో 9570 ఓటర్లను చేర్పించి నందుకు, అదే విధంగా రాష్ట్రంలోనే నెల్లూరు నగరం ప్రథమ స్థానంలో నిలిపినందుకు ఆయన జిల్లా నాయకులకు అభినందనలు తెలిపారు.










