Mar 12,2022 14:44

ప్రజాశక్తి-పుత్తూరు టౌన్ : పట్టణంలోని స్థానిక‌ పున్నమి సమీపము లో ఉన్న వైయస్సార్ విగ్రహం వద్ద  శనివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైసిపి నాయకులు,ఎమ్మెల్యే సోదరుడు కుమారస్వామి రెడ్డి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. పట్టణంలోని ప్రభుత్వ  హాస్పిటల్ నందు రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు అదేవిధంగా స్థానిక అంబేద్కర్ విగ్రహం సమీపంలో కార్వేటి నగర్ రోడ్డు నందు పేదలకు అన్నదానం కార్యక్రమం కుమారస్వామి రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో పేదలకోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని కొనియాడాడు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చైర్మన్ ఆనంగి గెడ్డం హరి, వైస్ చైర్మన్లు డి శంకర్. డి డి జయప్రకాష్,(చిట్టీ), ఎంపీపీ ముని వేలమ్మ ఎంపీటీసీలు కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు వైఎస్సార్సీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.    ‌