Feb 20,2022 23:27

వెన్సిక సిరికి అవార్డు అందిస్తున్న ఛీప్‌ జడ్జిలు

అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే రోజా
ప్రజాశక్తి- పుత్తూరు టౌన్‌
: చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణానికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి సోలో స్కేటింగ్‌ మారథాన్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకుంది. శనివారం నంగిలి చెక్‌పోస్టు నుంచి నగరి వరకు 250 కిలోమీటర్లు నాన్‌స్టాప్‌గా స్కేటింగ్‌ చేసి ఆసియా పసిఫిక్‌ వరల్ట్‌ రికార్డుతో పాటు గ్లోబల్‌ వరల్డ్‌ రికార్డు, వజ్రా వరల్ట్‌ రికార్డులలో రిజిస్టిర్‌ అయ్యింది. దీంతో ఆదివారం పుత్తూరు ఎమ్మెల్యే ఆర్‌కె.రోజా స్థానిక అంబేద్కర్‌ కూడలిలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి అభినందించడంతోపాటు రూ.లక్ష చెక్కును అందించారు. ఈసందర్భంగా ఆసియా పసిఫిక్‌ వరల్డ్‌ రికార్డ్‌, గ్లోబ్‌ వరల్డ్‌ రికార్డు చీప్‌ జడ్జి మురుగానందరం వజ్రా వరల్ట్‌ రికార్డు చీఫ్‌ జడ్జి తిరుపతి రావు అవార్డును, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. తల్లిదండ్రులు ప్రతి ఆడపిల్లలోని టాలెంట్‌ను గుర్తించి వారికి అవకాశాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో టాలెంట్‌ స్కేటింగ్‌ అకాడమీ ఫౌండర్‌ అండ్‌ ఛీఫ్‌ కోచ్‌ ప్రతాప్‌ సింగ్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌ హరి, వైస్‌ఛైర్మన్‌ డి.శంకర్‌, డి.జయప్రకాష్‌, ఐసిడిఎస్‌ ప్రాజెక్టు అధికారి పద్మజ, తదితరులు పాల్గొన్నారు.