Dec 03,2022 22:22

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌

పుట్టిన పిల్లలకూ ఆధార్‌ తప్పనిసరి : జేసీ

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌
ఆధార్‌ ఆప్‌ డేషన్‌ ప్రతి 10 సంవత్సరాలకు తప్పని సరని, రాష్ట్రంలో,దేశంలో ప్రభుత్వ పథకాలకు తప్పనిసరని, పుట్టిన పిల్లలకు ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లకముందే వారికి తల్లి వేలిముద్రలు తో ఆధార్‌ కల్పించాలని, జిల్లాలో 229 కేంద్రాలు ఉన్నాయనీ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ అన్నారు. ఆధార్‌ ఆవశ్యతపై లభ్యం గురించి జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆధార్‌ తప్పని సరి అని అన్నారు. అదేవిధంగా ఆధార్‌ లో మార్పులకు ఒకసారి మాత్రం చేసుకోవాలని కొన్ని మార్పులు ఎక్కువ సార్లు చేసుకోవాలంటే జనన ధ్రువీకరణ పత్రాలు తప్పని సరి అన్నారు. 10 సంవత్సరాల ముందు ఆధార్‌ తీసుకొన్నవారు అన్ని సమాచారాలు కరెక్ట్‌ గా వుంటే అప్‌ డేట్‌ చేసుకోవాలి. చిత్తూరు జిల్లాలో మొత్తం 45,60,606 మందికి నవంబర్‌ 30 నాటికి ఉన్నాయని, 628637 మందికి సంభందించిన డాక్యుమెంట్లు పెండింగ్‌ లో ఉన్నాయని అన్నారు.సెప్టెంబర్‌ నుంచి ఇప్పటివరకు మార్పులు కోసం ఉపయోగిస్తున్న 79 కిట్లు లో ఇప్పటి వరకూ 5000 మాత్రమే చేశారని అన్నారు.మొబైల్‌ వాహనాల ద్వారా కూడా ఆధార్‌ ఇవ్వడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌తో పాటు డిఅర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌ , డిపిఓ లక్ష్మి, డి అర్‌ డి ఏ పీడీ తులసి, గహనిర్మాణ శాఖ పి డీ పద్మనాభం, జిల్లా వ్యవసాయాధికారి, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ శేషగిరి రావు, ఎస్‌ బి డి ఎస్‌ పి శ్రీనివాసులు రెడ్డి లతో పాటు ఆధార్‌ ప్రతినిధి జావేద్‌ పాల్గొన్నారు.