ప్రజాశక్తి-అనంతపురం పూర్వ విద్యా ర్థులు తోడ్పాటుతోనే అనంతపురం జెఎన్‌టియు ఇంజినీరింగ్ కళాశాల యూనివర్సిటీ మరింత అభివృద్ధి సాధ్యమని ఉపకులపతి రంగజనార్ధన కోరారు. శుక్రవారం స్థానిక జెఎన్‌టియు ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో పూర్వ విద్యార్థులు కలియక సమావేశం నిర్వహంచారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సూచనలు, సలహాలను తప్పకుండా పాటిస్తామన్నారు. ఈ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు గొప్ప గొప్ప పదవులలో ఉన్నారన్నారు. ఇప్పుడు చదువుతున్న విద్యార్థులకు మీ అనుభవాలు, పలు సూచనలు ఇవ్వాలన్నారు. కొంతమంది పూర్వ విద్యార్థులు కళాశాలకు ఎంతో తోడ్పాడుటును అందిస్తున్నారన్నారు. అలాగే ప్రతి సంవత్సరం అల్యూమిని మీట్ ను నిర్వహిస్తామని తెలిపారు. కళాశాలలోని ప్రతి విభాగంలో సెంటర్స్ అఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. గౌరవ అతిథి కర్ణాటక బెల్గం విఐటియు మాజీ ఉపకులపతి, జెఎన్‌టియు కళాశాల పూర్వ విద్యార్థి కె.భాలవీరారెడ్డి మాట్లాడుతూ ఈ కళాశాల వల్లే తాను ఎంతో గొప్ప స్థాయికి ఎదిగామన్నారు. ఈ కళాశాలకు ప్రతి పూర్వ విద్యార్థి తోడ్పాటును అందించి కళాశాలను ఉన్నత స్థాయికి తీసుకరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెఎన్‌టియు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్‌వి.సత్యనారాయణ, రెక్టార్ ఎం.విజయకుమార్, రిజిస్ట్రార్ సి.శశిధర్, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.వి.సత్యనారాయణ, యూనివర్సిటీ డైరెక్టర్లు పి.సుజాత, మాజీ ఆచార్యులు డి.సాయి బాబారెడ్డి, మాజీ ఆచార్యులు వి.శంకర్, తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న జెఎన్‌టియు విసి రంగజనార్ధన










