Aug 27,2023 21:25

ఆన్‌లైన్‌ ద్వారా పూర్వ విద్యార్థులతో మాట్లాడుతున్న జెఎన్‌టియు ఉపకులపతి రంగజనార్ధన

           ప్రజాశక్తి-అనంతపురం    పూర్వ విద్యార్థుల సహాయ, సహకారాల తో జెఎన్‌టియు కళాశాలను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లనున్నట్లు జెఎన్‌టియు పకులపతి రంగజనార్ధన తెలిపారు. ఆదివారం స్థానిక జెఎన్‌టియు ఇంజినీరింగ్‌ కళాశాల (1994-1998) ఎఫ్‌డిహెచ్‌ బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు కళాశాలను సందర్శించారు. ఇందులో భాగంగా మెకానికల్‌ సెమినార్‌ హాలులో విసితో ఆన్‌లైన్‌ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విసి మాట్లా డుతూ ఇలాంటి సమావేశాల వల్ల పూర్వ విద్యార్థులు తోటి మిత్రులను కలిసే అవకాశం కలుగుతుందన్నా రు. ముఖ్యంగా పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి ఎంతో తోడ్పాటును అందిస్తున్నారని తెలిపారు. రాబోవు కాలంలో కూడా పూర్వ విద్యార్థుల సహకారంతో కళాశాలను మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లనున్నట్లు వివరించారు. అలాగే పూర్వ విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు దిశానిర్ధేశం చేయాలని పిలుపునిచ్చారు. రెక్టార్‌ ఎం.విజయకుమార్‌ మాట్లాడుతూ అనంతపురం ఇంజినీరింగ్‌ కళాశాలకు పూర్వ విద్యార్థుల సహకారం ఎప్పటికీ మరువలేనిదన్నారు. ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ఎన్నో గొప్ప పదవులను అలంకరించారన్నారు. రిజిస్ట్రార్‌ సి.శశిధర్‌ మాట్లాడుతూ అల్యూమిని అసోసియేషన్‌ కళాశాలకు బలం అన్నారు. యూనివర్శిటీ అభివృద్ధిలో అల్యూమిని సభ్యుల సలహాలు, సూచనలు ఎప్పుడూ చాలా అవసరం అవుతాయన్నారు. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు ఇతర దేశాల్లో ఉద్యోగం చేయడం వల్ల కళాశాలకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు 1994-1998 ఎఫ్‌డిహెచ్‌ బ్యాచ్‌ విద్యార్థులు ఎం.హరినాథ్‌రెడ్డి, శివరామిరెడ్డి (లండన్‌), ఎం.నాగమణి, (హైదరాబాద్‌ యూనివర్సిటీ), ఓబుళరెడ్డి (మైక్రో సాఫ్ట్‌ కంపెనీ పూణే) ఎం.మోనోహర్‌రెడ్డి (బ్రేక్‌ ఇన్స్‌పెక్టర్‌), డి.శ్రీనివాసు లు, బాలకృష్ణ, యూనివర్సిటీ ఫారెన్‌ అఫైర్స్‌ అండ్‌ ఆల్యూమినీ మ్యాటర్స్‌ డైరెక్టర్‌ పి.సుజాత, కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ అరుణకాంతి, అరుణ మస్తాని, ఎస్‌.చంద్రమోహన్‌రెడ్డి, ఎం.అంకారావు, కళ్యాణి రాధా, మాజీ ఆచార్యులు డి.సాయిబాబారెడ్డి, వి.శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.