Jul 05,2023 22:29

పూర్వ విద్యార్థులతో జెఎన్‌టియు విసి రంగజనార్ధన్‌

       అనంతపురం : అనంతపురం జెఎన్‌టియు ఇంజినీరింగ్‌ కళాశాల అభివద్ధిలో పూర్వ విద్యార్థుల పాత్ర అమోఘం అని విసి రంగజనార్ధన పేర్కొన్నారు. 1970వ సంవత్సరం జెఎన్‌టియు పూర్వ విద్యార్థి పి.శంకర నారాయణ వర్శిటి అధికారులతో బుధవారం నాడు సమావేశం అయ్యారు. వర్సిటీ అభివృద్ధికి తనవంతు సహకారం అందించేందుకు ఆయన అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా విసి రాబోవు కాలంలో పూర్వ విద్యార్థుల సహకారంతో జెఎన్‌టియు కళాశాలను మరింత అబివద్ది పథంలోకి తీసుకెళ్తామన్నారు. ఈ నెల 7వ తేదీన కళాశాల యాన్యువల్‌ అల్యూమిని మీట్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ మీట్‌కు పూర్వ విధ్యార్థులందరూ రావాలని విసి కోరారు. నెల్లూరు జిల్లాకు చెందిన జెఎన్‌టియు పూర్వ విద్యార్థి పి.శంకర నారాయణ అమెరికాలో స్థిరపడ్డారని, ఆయన కళాశాల అభివృద్ధికి తనవంతు సాయం అందిస్తానని చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టార్‌ ఎం.విజయ కుమార్‌, రిజిస్ట్రార్‌ సి.శశిధర్‌ , ఓటీపీఆర్‌ఐ డైరెక్టర్‌ బి.దుర్గాప్రసాద్‌, వి.సుమలత, అనంతపురం జెఎన్‌టియు కళాశాల ప్రిన్సిపాల్‌ పి.సుజాత, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఆర్‌.భవాని, కళాశాల పూర్వ విద్యార్థి వి.శంకర్‌, డాక్టర్‌ కళ్యాణిరాధ, డాక్టర్‌ ఎం.రామశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.