
పలాస : పలాస- కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని చినబాడాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1989 విద్య సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు బుధవారం పాఠశాల ఆవరణలో కలసి గతాన్ని నెమరువేసుకొని ఒకరినొకరు అలింగనం చేసుకున్నారు. మిత్రుల యోగక్షమాలు అడిగి తెలుసుకున్నారు. 34 ఏళ్ల తరువాత ఒకే వేదికలో వారి అపూర్వ కలయిక గతంలో తిరుగాడిన ఆనంద క్షణాలను గుర్తుకు తెచ్చుకున్నారు. 108 మంది విద్యార్థుల్లో డాక్టర్లు, ఇంజినీర్లతో పాటు త్రివిధ దళాల్లో సైనికులుగా మరికొందరు ఉపాధ్యాయులు, వ్యవసాయం, మరికొందరు స్వయం ఉపాధి, తదితర రంగాల్లో స్థిరపడ్డారు. కార్యక్రమానికి ముందుగా అప్పటి ఉపాధ్యాయులు సాంబమూర్తి, భగవాన్, ప్రస్తుత ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రతినిధి దువ్వాడ రమణ, ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి, వెంకటాచలం, కవిటి హరి, అజరు, తమ్మినేని తిరుపతిరావు, కన్యాకుమారి, తిరుపతమ్మ, రమణమ్మ, భారతి, ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.