Jun 11,2023 18:11

ప్రజాశక్తి - కాళ్ల
36 ఏళ్ల క్రితం 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు కలిసేందుకు కాళ్ల హైస్కూల్‌ వేదికైంది. 1987-88లో పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. విద్యార్థులంతా ఓ చోట కలిసి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. 36 ఏళ్ల తర్వాత కలుసుకున్న వారంతా ఒకచోట చేరి ఆత్మీయ పలకరింపులతో యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆనందంగా గడిపారు. కుటుంబ సమేతంగా పూర్వ విద్యార్థులు హాజరవ్వడంతో పాఠశాల ప్రాంగణమంతా పూర్వ విద్యార్థుల కుటుంబ సభ్యులతో నిండిపోయింది. వివిధ వృత్తులు ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడి వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా ప్రస్తుత బిజీ షెడ్యూల్లో కూడా స్నేహ బంధమే ముఖ్యమంటూ ఓ చోట కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకూ సంతోషంగా గడిపారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేద్దామంటూ తోటి విద్యార్థులకు ఉపయోగపడతామంటూ తీర్మానాలు చేసుకున్నారు. ఆత్మీయ కలయికకు కృషిచేసిన బండారు ఫణి భోగయ్య, డి.పురుషోత్తం, గనిశెట్టి బాబ్జి, బేతు రాంబాబు, చిన్నం జాన్‌ మోజెస్‌, ముత్యం శేఖర్‌బాబు, షేక్‌ శ్రీను, కోటి సుబ్బారావు, గనిశెట్టి రంగారావు తోటి విద్యార్థులు అభినందించారు.