Jun 10,2022 23:02

టిడ్కో ఇళ్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌ : నగరంలోని పూణేపల్లి వద్ద నిర్మించిన టిడ్కో ఇళ్ల సముదాయాన్ని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ పరిశీలించారు. వెంటనే ఇళ్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వారంలో పూర్తి చేయాలని ఆదేశించారు. శుక్రవారం ఇళ్లను పరిశీలించిన కలెక్టర్‌ మొదటి కేటగిరీలో భాగంగా (300 ఎస్‌ ఫ్‌ టి ఎస్‌) 2256 మంది లబ్ధిదారులు కలరని, అందులో 1426 మంది రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఇప్పటి వరకు పూర్తిచేశామ ని 169 మంది లబ్ధి దారుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరుగుతున్నదని తెలిపారు. టిక్కొ ఇండ్ల సము దాయమును పూర్తి స్థాయి లో డిసెంబర్‌ లోపు పూర్తి చేస్తామన్నారు. మౌలిక సదు పాయాల కల్పన పనులు వచ్చే వారం నుండి ప్రారంభిస్తామని ఈఈ శివప్రసాద్‌ కలెక్టర్‌కు వివరించారు. రెండవ( 365 ఎస్‌ ఫ్‌ టి ఎస్‌), మూడవ(430 ఎస్‌ ఫ్‌ టి ఎస్‌) కేటగిరీ లకు సంబంధించిన లబ్ధి దారులకు బ్యాంకుల ద్వారా 470 మందికి రుణా లు మంజూరు చేయిం చడం జరిగిందని మెప్మా పిడి రాధమ్మ కలెక్టర్‌ కు వివరించారు.