Oct 07,2023 20:17

పిల్లలకు దుస్తులు పంచుతున్న దృశ్యం

పిల్లలకు దుస్తులు పంచుతున్న దృశ్యం

పులి దాడిలో మతి చెందిన లక్షిత
జయంతి వేడుకల్లో అన్నదానం
ప్రజాశక్తి-బుచ్చిరెడ్డిపాలెందైవ దర్శం కోసం కుటుంబం సమేతంగా రెండు మాసాలు క్రితం తిరుమల వెళ్లే క్రమంలో దురదష్టవ శాత్తు లక్షిత చిన్నారిని పులి దాడి చేసి పొట్టన పెట్టుకొంది. లక్షిత జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ శనివారం అనాథ పిల్లలకు అన్నదానం, వస్త్రదానాలను లక్షిత తల్లి తండ్రులు దినేష్‌, శశికళలు బుచ్చిలో ప్రగతి చారిటబుల్‌ ట్రస్టు కార్యక్రమాన్ని జరిపారు. పసి బిడ్డను పోగొట్టుకున్న బాధలో సాటి బిడ్డలను తన బిడ్డలుగా భావించి మానవత్వంతో మంచి కార్యక్రమాన్ని చేపట్టడంతో పలువురు వారికి అభినందనలు తెలిపారు. చెవిటి, మూగ పిల్లలకు 60మందికి చేయూత నిచ్చారు. పోతి రెడ్డి పాలెంకు చెందిన లక్షిత తల్లి తండ్రులకే ఈ ఘనత దక్కిందిని చెప్పొచ్చు
.