ప్రజాశక్తి-పుత్తూరు టౌన్ : గిరిజనులు ప్రభుత్వం పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వారి యొక్క కులు చట్టాలు గూర్చి తెలుసుకోవాలని పుత్తూరు సీనియర్ సివిల్ జడ్జి మరియు యు అండ్ ఐ న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు అప్పలస్వామి పేర్కొన్నారు. శనివారం మండలంలోని గోపాలకృష్ణ పురం ఎస్టీ కాలనీలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల పిల్లలను బాగా చదివించాలని, విద్యాహక్కు చట్టం గూర్చి బాల్య వివాహాల వలన కలిగే అనర్ధాల బుజ్జి బాల్యవివాహాల నిర్మూలన చట్టం బాల కార్మికుల నిర్మూలన చట్టం, భ్రూణ హత్యల నిరోధక చట్టం గూర్చి వివరించారు. గిరిజనులు అటవీ సంపదలను చట్టాలకు అనుగుణంగా అనుభవించాలని సూచించారు. హిందూ వివాహ చట్టం గిరిజనులకు గుర్తించడం లేదని వారి చట్టాలకు అనుగుణంగా వారి ఆచార వ్యవహారాలను అనుసరించు కోవచ్చవని తెలిపారు. అనంతరం పుత్తూరు సీఐ వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ సివిల్ వివాదాలను క్రిమినల్ కేసులుగా పరిగణించ రాదని సరి అయిన సంఘటన జరిగి నా వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని సూచించారు. అనంతరం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషకాహారం కిట్లను గర్భవతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీవో వాణి ఆర్ ఐ పి బాలాజీ. పుత్తూరు న్యాయ వ్యాధి, మురుగేషన్ రెడ్డి, ఎస్ టి హాస్టల్ వెల్ఫేర్ అధికారి మునిరత్నం, అటవీశాఖ అధికారి, పంచాయతీ సెక్రెటరీ చక్రపాణి సిడిపిఓ పద్మజ పర్యవేక్షణ అధికారి ఇ గీతాంజలి అరుణ్ కిరణ్, సర్పంచ్ వేలాయుధం పాల్గొన్నారు.










